ఉగాది షడ్రుచులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి?

తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. దానికి పూర్వకాలం నుండే ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. ఉగాది అనేది.. సరికొత్త తెలుగు సంవత్సరాదికి ఆరంభం మాత్రమే కాదు, మానవ జీవన విధానంలో సమతుల్యత(బ్యాలెన్సింగ్)ని గుర్తుచేసే ఒక ప్రత్యేకమైన రోజు. ఉగాది పండుగ అనగానే.. ముందుగా అందరికి ఉగాది పచ్చడి గుర్తుకు వస్తుంది. ఆరు రకాల రుచుల కలయికతో(షడ్రుచులు) జీవితంలోని వివిధ కోణాలను, అనుభవాలను సూచిస్తుంది ఉగాది పచ్చడి. అయితే.. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి కమ్మని రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది? దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం! ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఏవి? ఉగాది పచ్చడిని – వేపపువ్వు (చేదు), బెల్లం (తీపి), చింతపండు (పులుపు), ఉప్పు (ఉప్పు), మిరప (కారం), మామిడి కాయ (వగరు) అని ఈ ఆరు రుచులతో తయారు చేస్తారు. మరి ఈ షడ్రుచులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి? తీపి (బెల్లం): తీపి అనేది శరీరానికి శక్తిని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఉండే ఇనుము, కాల్షియం రక్తహీనతను నివారిస్తాయి. అలాగే శరీరంలో వేడిని తగ్గించి, కఫ దోషాన్ని బ్యాలన్స్ చేస్తుంది. తీపిని మితంగా తీసుకుంటే మేలు చేస్తుంది.. అధికంగా తీసుకుంటే మధుమేహం ప్రమాదం పెరగవచ్చు. పులుపు (చింతపండు): ఆకలిని పెంచడమే కాకుండా శరీరంలో జీర్ణ రసాలను ఉత్తేజపరుస్తుంది. చింతపండులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. కానీ, ఎక్కువ పులుపు తీసుకుంటే గుండెల్లో మంటను కలిగించవచ్చు. ఉప్పు (ఉప్పు): ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడమే గాక, నీటి శాతాన్ని బ్యాలన్స్ చేస్తుంది. ఇది పిత్త దోషాన్ని నివారిస్తుంది. కానీ, అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది కాబట్టి తక్కువగా మితంగా తీసుకుంటే మంచిది. కారం (మిరప): కారం అనేది జీవక్రియను (మెటబాలిజం) వేగవంతం చేయడమే గాక చెమట ద్వారా వేడిని తగ్గిస్తుంది. మిరప కాయల్లోని క్యాప్సైసిన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కానీ, తీసుకునే ఆహారంలో ఎక్కువ కారం అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను తెస్తుందని గుర్తుంచుకోవాలి. చేదు (వేపపువ్వు): వేప చేదు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది ఎలాగంటే.. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇది పిత్త దోషాన్ని నివారించడమే గాక, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ చేదుని పిల్లలకు దూరంగా ఉంచాలి. వగరు (మామిడి): మామిడి వగరు జీర్ణక్రియను సులభతరం చేయడమే గాక శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మామిడికాయలో విటమిన్ A, C ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. అయితే.. ఎక్కువ వగరు తింటే గొంతు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఆరు రుచులు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) నియంత్రిస్తాయి. అయితే.. ఈ 6 రుచులలోని ఒక్కో రుచి శరీరంలో ఏయే అవయవాలను ఉత్తేజపరుస్తాయో ఇప్పుడు చూద్దాం! తీపి – కడుపు, ప్లీహము పులుపు – గుండె, ఊపిరితిత్తులు ఉప్పు – కిడ్నీలు కారం – పెద్దప్రేగు చేదు – కాలేయం వగరు – చిన్నప్రేగు ఈ రుచులను తగిన మోతాదులో తీసుకోవడం శరీర ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ ఉగాది షడ్రుచులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఒక సంపూర్ణ ఔషధంగా పనిచేస్తాయి. ఈ విశ్వావసు నామ ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులను ఆస్వాదిస్తూ, వాటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ప్రారంభించడానికి ఉగాది పచ్చడి ఒక అద్భుతమైన మార్గం. ఈ ఉగాది మీకు చక్కని ఆరోగ్యాన్ని అందించాలని కోరుతూ.. మరోసారి మెడ్ యునైటెడ్ వారి తరపున శుభాకాంక్షలు!
అంబాజీపేట మెడ్ యునైటెడ్ ఉచిత మెగా మెడికల్ క్యాంపు

సినీ తారలకు అభిమానులు ఉండటం అనేది సాధారణ విషయమే. కొంతమంది వాళ్ళను సినిమాల వరకు అభిమానిస్తారు. మరికొందరు సినిమాలతో పాటు వారి సామాజిక జీవితంలో కూడా అభిమానం చాటుతూ ఉంటారు. అందుకే అభిమాన నటులకు సంబంధించి స్పెషల్ డేస్ ఏం ఉన్నా.. వాటిని ఎవరి ఏరియాలో వారు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న, అంబాజీపేటలోని కేవీ పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న కమిటి హాల్ నందు మెగా అభిమానులు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో పాల్గొన్న మెడ్ యునైటెడ్ వైద్యులుడా. అశోక్ కుమార్ (జనరల్ మెడిసిన్)డా. రాఘవ (పీడియాట్రిక్)డా. మల్లిక (దంత వైద్యులు)డా. సందీప్ (ఆర్థోపెడిక్)డా. తేజస్విని, డా. భవిత రాణి (కంటి వైద్యులు)డా. వరప్రసాద్ (డ్యూటీ డాక్టర్) ఈ వైద్యుల బృందం కలిసి మెగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న 172 మందికి జనరల్ చెకప్ లతో పాటు తగిన వైద్య సహాయం అందించి, ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ క్యాంపుకు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నందున మెడ్ యునైటెడ్ వైద్య బృందంతో పాటు మెగా అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి మెడికల్ క్యాంపులకు మెగా అభిమానులు మున్ముందు సహకరిస్తారని తెలిపారు.
గులియన్ బారే సిండ్రోమ్: లక్షణాలు, రకాలు మరియు నివారణ పద్ధతులు!

గులియన్ బారే సిండ్రోమ్(GBS):- ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వ్యాధులలో గులియన్ బారే సిండ్రోమ్(GBS) ఒకటి. ఇదొక అరుదైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. మన శరీరంలోని నాడీ వ్యవస్థ(PNS)పై ప్రభావం చూపే ఈ వ్యాధి.. నరాల చుట్టూ ఉండే పొర దెబ్బతినడం వల్ల వ్యాప్తిచెందుతుంది. దీని కారణంగా నరాలు దెబ్బతిని, కండరాలు బలహీనపడటమే గాక ఒక్కోసారి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఈ వ్యాధికి వయోపరిమితి ఏమి లేదు, కానీ ఎక్కువగా 50 ఏళ్ళు దాటిన వారికి వచ్చే అవకాశం ఉంది. ఇక వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వారిలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, అతిసారం లేదా ఏవైనా టీకాలు, సర్జరీల వల్ల ఈ వ్యాధి సోకవచ్చు. ఇది ప్రాణాంతకమైంది కాకపోయినా, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ వ్యాధి బారినపడి 3-5% మంది వృద్ధాప్యంలో ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెప్తున్నాయి. గులియన్ బారే సిండ్రోమ్ కి గల కారణాలు: ఈ వ్యాధి సోకడానికి సరైన కారణాలు లేవు. కానీ, బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన తర్వాత ఈ గులియన్ బారే సిండ్రోమ్(GBS) సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యాధి ప్రభావాన్ని కోవిడ్, ఇన్ఫ్లుయెంజా మరియు డెంగ్యూ లాంటి వైరస్ లు పెంచుతాయి. ముఖ్యంగా కలుషిత ఆహారం, నీటి ద్వారా వేగంగా వ్యాపించే ఈ వ్యాధికి.. కాంపిలోబాక్టర్ జెజుని (కాంపిలోబాక్టర్ జెజున్) బాక్టీరియాని ప్రధాన కారణంగా చెప్తున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ రకాలు: ఈ గులియన్ బారే సిండ్రోమ్ (GBS)లో చాలా రకాలు ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానంగా చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి. అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమిలినేటింగ్ పాలీరాడిక్యులో న్యూరోపతి (AIDP): ఇది సాధారణంగా కనిపించే రకం. నరాల మైలిన్ కోశంపై దాడి చేయడం వల్ల.. అవయవాలతో పాటు ఇంద్రియ వ్యవస్థ బలహీనపడిపోతాయి. ఇది ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలలో కనిపిస్తుంది. అక్యూట్ మోటార్-సెన్సరీ యాక్సోనల్ న్యూరోపతి (AMSAN): ఇది గులియన్-బారే సిండ్రోమ్(GBS) లో తీవ్రమైన రకం. బలహీనత, టెండన్ రియాక్షన్స్ కోల్పోవడం, ఇంద్రియాల పనితీరుపై పడిన ప్రభావం దీని లక్షణాలు. మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ (MFS): మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్ అనేది అరుదైన రకం. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క నరాలపై దాడి చేస్తుంది. మొదట కళ్ళ చుట్టూ నల్లని మచ్చలు(చారలు)గా తయారై ‘ఫెషియల్ పెరాలసిస్’కి దారితీస్తుంది. ఇది ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. అక్యూట్ మోటార్ యాక్సోనల్ న్యూరోపతి (AMAN): ఇది తీవ్రమైన పక్షవాతం వచ్చి, కంటిచూపు మందగించినప్పుడు తెలుస్తుంది. ఎక్కువగా ఈ రకం మెక్సికో, చైనా, జపాన్ దేశాలలో కనిపిస్తుంది. గులియన్-బారే సిండ్రోమ్(GBS) నిర్ధారణ పరీక్షలు: ఎప్పుడైతే నరాల సమస్యలతో వైద్యులను సంప్రదిస్తారో.. అప్పుడు మీ హెల్త్ డేటా అంతా చూసి, కావాల్సిన టెస్టులను తెలియజేస్తారు. వాటిలో ముఖ్యంగా.. నరాల ప్రసరణ అధ్యయన (NCS) & ఎలక్ట్రోమియోగ్రఫీ: శరీరంలో దెబ్బతిన్న నరాల ఉనికి, తీవ్రతలను గుర్తించి.. కండరాల మధ్య విద్యుత్ చర్యలను అంచనా వేసి బలహీనత లేదా పక్షవాతం ఎలా, ఎందుకు? వచ్చిందని ఈ టెస్ట్ ద్వారా తెలియజేస్తారు. లంబార్ పంక్చర్ (స్పైనల్ ట్యాప్): ఇది సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్(CSF) సేకరణ కోసం వీపు దిగువ భాగంలో సూదిని చొప్పించే ప్రక్రియ. ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి సంకేతాల కోసం ఈ టెస్ట్ నిర్వహిస్తారు. రక్త పరీక్షలు: ఇమ్యూన్ డిజార్డర్స్ మరియు నరాల బలహీనత లేదా పక్షవాతం వల్ల ఎదురయ్యే సమస్యలను రక్త పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఇమేజింగ్ పరీక్షలు: నరాల బలహీనత లేదా పక్షవాతం వలన ఏర్పడే ట్యూమర్, హెర్నియేటెడ్ స్పైన్ గాయాలను గుర్తించడంలో ఎక్స్-రే, ఎంఆర్ఐ మరియు సిటి స్కాన్ లాంటి ఇమేజింగ్ టెస్టులు నిర్వహిస్తారు. నరాలు మరియు కండరాల బయాప్సీ: గులియన్ బారే సిండ్రోమ్ చికిత్స మార్గాలు: గులియన్ బారే సిండ్రోమ్ నివారణ పద్ధతులు: ఇక్కడ మనం గమనించవల్సింది ఏంటంటే.. ఈ గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది అంటువ్యాధి మాత్రం కాదు. సమయానికి అవసరమైన చికిత్స తీసుకుంటే దాని ప్రభావం నుండి బయట పడవచ్చు. ఎవరిలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తే మనం కూడా సురక్షితంగా ఉండవచ్చు. కానీ, తెలిసి కూడా ఈ వ్యాధి లక్షణాలను పట్టించుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నుండి బయట పడేందుకు పునరావాసం ముఖ్యమైంది. మీ హెల్త్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే.. సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం! తక్షణమే మా నిపుణుల సలహా కొరకు 9851 247 365 కి కాల్ చేయండి.
పని చేయకపోయినా.. శరీరం అలసిపోయినట్లు, రోజంతా నీరసంగా అనిపిస్తుందా?

ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. ఆధునిక జీవనశైలికి తోడు ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా ఆహారంలో విటమిన్లు కూడా తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విటమిన్ల లోపం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే.. మన ఆరోగ్యం విషయంలో విటమిన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అసలు విటమిన్ల లోపం ఏర్పడితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఏంటి? అనేవి ఇప్పుడు చూద్దాం! మన శరీరంలో విటమిన్లు లోపించాయని గుర్తించడం ఎలా? మన శరీరానికి విటమిన్ బి12 అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది అన్ని అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది.సాధారణంగా శరీరంలో విటమిన్ b12 లోపిస్తే.. రోజంతా అలసటగా అనిపిస్తుంది. ఎలాంటి పనులు చేయకపోయినా త్వరగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అదీగాక రోజంతా నీరసంగాను ఉందంటే.. అది తప్పకుండా విటమిన్ బి12 లోపించిన ప్రభావమే అని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్స్ లోపం అనేది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు జ్ఞాపకశక్తి మెల్లగా తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాత్రుళ్ళు అలసిపోయిన ఫీలింగ్, ఎక్కువగా చెమటలు పట్టడం కూడా విటమిన్ b12 లోపించిన లక్షణాలలో ఒకటని అంటున్నారు. అంతేగాక విటమిన్స్ ప్రభావం కండరాలపై కూడా ఉంటుంది. విటమిన్స్ లోపిస్తే గనుక కండరాల పనితీరును బలహీన పరుస్తాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. శరీరంలో విటమిన్ బి12 అనేది సహజంగా ఉత్పత్తి కాలేదు. అందువల్ల మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే శరీరానికి విటమిన్ బి12 అందుతుంది. విటమిన్స్ అనేవి ఎక్కువగా పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్ల నుండి లభిస్తాయి. ఒకవేళ శాకాహారులు అయితే విటమిన్ బి12 ని సప్లిమెంట్లు ద్వారా లేదా పోషకాహారాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. విటమిన్ బి12 అనేది కాలేయంలో నిల్వ ఉంటుందట. ఒకవేళ కాలేయంలో నిల్వ తగ్గినా.. విటమిన్స్ లోపం ఏర్పడుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
యువతలో ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా?

ఈ మధ్యకాలంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఎప్పుడో వయసు పైబడిన తర్వాత రావాల్సిన ఆరోగ్య సమస్యలు.. యుక్త వయసులోనే ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా యువతలో హార్ట్ ఎటాక్(గుండె పోటు) సమస్య ఆందోళన కలిగిస్తోంది. గతంలో వయసు పైబడిన వారిలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు చూసేవాళ్ళం. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుండటంతో.. యువత కంగారు పడిపోతోంది. మరి గుండెపోటు చిన్న వయసులో రావడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్నలపై నిపుణులు ఈ విధంగా స్పందిస్తున్నారు. అలాగే హార్ట్ ఎటాక్స్ రావడానికి కొన్ని అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి యువతలో ఎక్కువ హార్ట్ ఎటాక్స్ రావడానికి గల అంశాలేంటో చూద్దాం! ఒత్తిడి:ఒత్తిడి అనేది మనిషిని మానసికంగా ఎంతలా వేధిస్తుందో చెప్పక్కర్లేదు. ఒత్తిడి మనిషిని మానసికంగా కృంగదీసి, శారీరకంగా ఆరోగ్య సమస్యలతో దెబ్బతీస్తుంది. ముఖ్యంగా యువతలో ఒత్తిడికి కారణాలు(ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్, లవ్, ఫైనాన్సియల్, జాబ్ స్ట్రెస్) ఏవైనా ఇవన్నీ గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. నిద్ర:సాధారణంగా వయసులను బట్టి ఇన్ని గంటలు నిద్ర తప్పనిసరి అని చెబుతుంటారు. యువత ఐతే కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. కానీ.. ఈ మధ్య యూత్ అంతా మొబైల్ ఫోన్ వాడకంతో రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, తెల్లారి చాలీచాలని నిద్రతో మేల్కోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ నిద్ర టైమింగ్స్ అన్ని మారిపోయి.. గుండె సమస్యలకు దారి తీస్తాయి. సరైన నిద్ర అనేది శరీరాన్ని సెట్ చేస్తుంది. స్మోకింగ్:ఈ మధ్యకాలంలో యువతలో ధూమపానం(స్మోకింగ్) అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు ఒత్తిడి(స్ట్రెస్) కారణంగా స్మోక్ చేస్తున్నాం అంటారు.. మరికొందరు ఫ్యాషన్ అంటుంటారు. స్మోక్ అనేది ఏ కారణంతో చేసినా.. ఆరోగ్యానికి పనికొచ్చే విషయమైతే అసలు కాదు. ముఖ్యంగా స్మోకింగ్ గుండె పనితీరుపై చాలా ప్రభావం చూపుతుంది. యువతలో హార్ట్ ఎటాక్స్ ఎక్కువ కావడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. సోమరితనం:సోమరితనం అనేది ఏ వయసులో వారినైనా ఆరోగ్యం పరంగా డామేజ్ చేస్తుంది. శారీరకంగా యాక్టీవ్ గా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల ఒబెసిటీ(ఊబకాయం), దీర్ఘకాలిక బీపీ సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ క్రమంగా గుండె మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. జంక్ ఫుడ్:రుచి కోసం చాలామంది ఎక్కువగా జంక్ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకోవడం ఫ్యాషన్ గా భావిస్తుంటారు యూత్. కానీ.. వాటిలో ఉండే అనవసరమైన ఫ్యాట్స్, సాల్ట్, షుగర్ ఎలిమెంట్స్ అన్ని అత్యధికంగా గుండె పైనే ప్రభావం తీవ్రంగా చూపిస్తాయి. యూత్ లో హార్ట్ ఎటాక్స్ కి ఇదికూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. జన్యుపరమైన కారణాలు:యువతలో గుండెపోటుకు జన్యుపరమైన అంశాలు కూడా కారణం అవుతాయట. కుటుంబంలో ముందునుండి ఎవరికైనా గుండె సమస్యలు, బీపీ, కొలస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటి ప్రభావం తర్వాత తరాలపై కూడా పడుతుందట. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం! ఒత్తిడి తగ్గించుకోవాలి:మానసికంగా లేదా శారీరకంగా ఒత్తిడికి గురైతే ఊహించని గుండె పై ప్రభావం పడే అవకాశం ఉంది. రెగ్యులర్ బిజీ లైఫ్ లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి తరచూ చేస్తుండాలి. అలా చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభించి.. వర్క్ లైఫ్ బాలన్స్ అవుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే ఒత్తిడితో పాటు యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. స్మోకింగ్:యుక్తవయసులోనే ధూమపానం(స్మోకింగ్) అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం. స్మోకింగ్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లను మెడికల్ హెల్ప్ ద్వారా త్వరగా దూరం పెడితే ప్రయోజనాలు ఉంటాయి. అలా చేయడం వల్ల మీ గుండెతో పాటు సమగ్ర ఆరోగ్య రక్షణ లభిస్తుంది. వ్యాయామం:గుండె ఆరోగ్యం కొరకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా యూత్ వ్యాయామం పాటిస్తే గనక చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ ప్రమాదం నుండి సేఫ్ గా ఉండవచ్చు. అలాగే ఎరోబిక్స్, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏదైనా చేయవచ్చు. వారానికి రెండుసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మరింత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం, ఉత్సాహంగా ఉండటం ద్వారా గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు. డైట్:గుండె ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు ఎంతో సహకరిస్తాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని పూర్తిగా తగ్గించి.. కూరగాయలు, పండ్లు, మల్టీగ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి సహకరించే హెల్తీ ఫ్యాట్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ లభించే ఫుడ్స్ తీసుకోవాలి. ఒబేసిటి:యువతలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులలో ఒబేసిటీ(ఊబకాయం) ఒకటి. ఇది డయాబెటిస్ తో పాటు గుండె సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఊబకాయానికి కారణాలు ఏవైనా.. కూర్చునే పని చేసినట్లయితే మధ్యమధ్యలో వాకింగ్ చేయడం.. షుగర్ ఫుడ్స్, ప్రాసెసెడ్ స్నాక్స్, అన్ హెల్తీ ఫ్యాట్స్ ని పూర్తిగా మానేయడం మంచిది. అలాగే పోషకాహారం, నీరు ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీని కంట్రోల్ లో పెట్టవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. సమస్య ఎలాంటిదైనా మెడికల్ సపోర్ట్ తో పాటు రెగ్యులర్ చెకప్స్ ఫాలో అయితే బెటర్ రిజల్ట్స్ చూడవచ్చు.
Breaking the Silence on Cervical Cancer: What Every Woman Needs to Know

Every year, countless women face a silent battle they never anticipated. Cervical cancer—a disease preventable with timely intervention—still claims lives due to late diagnosis and a lack of awareness. Imagine a world where a simple screening could save thousands of lives, yet many women miss the opportunity. Let’s talk about why cervical cancer matters, how it develops, and what we can do to stay ahead of it. What Is Cervical Cancer and How Does It Occur? Cervical cancer starts in the cells of the cervix—the lower part of the uterus that connects to the vagina. It occurs when healthy cells in the cervix develop mutations in their DNA. These mutations cause the cells to grow uncontrollably, forming a tumor. Over time, these cancerous cells can spread to other parts of the body if not detected and treated early. The most common cause? Persistent infection with certain types of human papillomavirus (HPV), a sexually transmitted virus. While HPV infections are common and often resolve on their own, some strains can lead to cellular changes that develop into cancer over the years. Human Papillomavirus (HPV) infections, it contribute to 87.8% – 96.7% of cervical cancer cases Causes and Symptoms of Cervical Cancer Causes: Symptoms to Watch For: Cervical cancer in its early stages often has no symptoms, which is why regular screenings are crucial. As the disease progresses, you may notice: If these symptoms sound familiar, don’t wait. Early diagnosis saves lives. Types and Stages of Cervical Cancer Types: Stages: Prevention, Cure, and Treatment Options Prevention: Treatment: Lifestyle Changes to Stay Ahead In our fast-paced lives, prioritizing health often takes a backseat. But small changes can make a big difference: Real-time example: In a study conducted in India, women who underwent routine Pap smears were 70% less likely to develop advanced cervical cancer compared to those who didn’t. Awareness and access matter. MedUnited Hospital’s Approach: Transforming Awareness into Action At MedUnited Hospital – The Best Hospital in Amalapuram, we’re committed to turning the tide against cervical cancer. Our comprehensive care includes: Final Thoughts Cervical cancer is preventable, treatable, and beatable—but only if we act. By staying informed, adopting healthy habits, and accessing regular screenings, we can protect ourselves and those we love. Let’s break the silence, spread the word, and make cervical cancer a thing of the past. Your health is your greatest wealth. Don’t wait—schedule your cervical screening today at MedUnited Hospital. Together, we can transform awareness into action.
ఆయువు భరోసా హెల్త్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్

ఆయువు భరోసా హెల్త్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్.. 2024 డిసెంబర్ 18న అమలాపురంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోనసీమ ప్రజలకు ఆరోగ్య సంరక్షణలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పట్ల.. రక్షణ కవచంగా, ఈ ప్రోగ్రామ్ నూతన ఉత్తేజాన్ని కలిగించనుంది. ఆయువు భరోసా ప్రధాన లక్ష్యాలు: దీని ప్రధాన లక్ష్యం.. కోనసీమ ప్రాంత ప్రజలకు ముందస్తు వ్యాధి నివారణ చర్యలు, నాణ్యమైన చికిత్స, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణతో పాటు వైద్య ఖర్చుల భారం తగ్గించడం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తగిన కార్పొరేట్ వైద్య సేవలను తమకు దగ్గరలోని హాస్పిటల్ లో సులభంగా పొందగలుగుతారు. ఆయువు భరోసా ఎలా మొదలైంది..? ఆధునిక జీవనశైలిలో నిత్యం ఎన్నో ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొంటున్నారు జనాలు. ఆర్థిక చేయూత లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి “సిఆర్ ట్రస్ట్”.. ఈ ఆరోగ్య సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయువు భరోసాతో కోనసీమ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించే దిశగా సిఆర్ ట్రస్ట్ కృషి చేస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమం.. మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ మరియు కిమ్స్ వైద్య కళాశాల ద్వారా కోనసీమ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సభ్యత్వ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆయువు భరోసా ఆలోచన ఎవరిది? విజనరీ లీడర్.. శ్రీ కెవివి సత్యనారాయణ రాజు గారు.. ఆయన్ని కోనసీమ అంతా ప్రేమగా ‘చైతన్య రాజు’ గారు అని పిలుస్తుంది. ఛాన్సలర్‌గా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీని, వ్యవస్థాపకుడిగా చైతన్య విద్యాసంస్థలను.. ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు. కరోనా మహమ్మారి సమయంలో జరిగిన ప్రాణనష్టం వర్ణనాతీతం.. కొందరికి సరైన వైద్యం అందక, మరికొందరు ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన చైతన్య రాజు గారు ఎంతో చలించిపోయారు. ఇకపై డబ్బు లేదనే కారణంతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సిఆర్ ట్రస్ట్ ని ప్రారంభించారు. అలా చైతన్య రాజు గారి ఆలోచనలో నుండి పుట్టిందే సిఆర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా కోనసీమ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందించాలని ఈ ‘ఆయువు భరోసా’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించారు. ‘ఆయువు భరోసా’ ఏయే హాస్పిటల్స్ లో వర్తిస్తుంది? ఆయువు భరోసా మెంబర్ షిప్.. కోనసీమ హాస్పిటల్స్ తో పాటు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్, ఆక్సిడెంట్ & ఎమర్జెన్సీ సెంటర్స్, మెడ్ యునైటెడ్ క్లినిక్స్ అన్నిచోట్లా వర్తించనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సౌకర్యాలతో ఈ ఆస్పత్రుల ద్వారా ఉత్తమ వైద్య సేవలు అందించనుంది. 24/7 వైద్యుల పర్యవేక్షణ, వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరికరాలు, ఆర్థోరిథం డ్రైవ్ ఫ్లాట్ ఫార్మ్స్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన వైద్య సంరక్షణ మరియు కమాండ్ సెంటర్ పర్యవేక్షణలో అనునిత్యం మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఆయువు భరోసా ప్రయోజనాలు ఏంటి? – 75 ఏళ్ళ వరకు అందరూ అర్హులే – సభ్యత్వం పొందిన వెంటనే ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అన్ని వైద్య సేవలు – ప్రతి మెంబర్ కి ఏడాదికి రూ. 5 లక్షల నుండి రూ. కోటి వరకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది – IP సేవలపై 100% వరకు తగ్గింపు – దీర్ఘకాలిక వ్యాధులకు తగు చికిత్స – ఉచిత OP సేవలు – ల్యాబ్ టెస్టులపై 50% వరకు తగ్గింపు – మందులపై 20% తగ్గింపు ఇవేగాక.. – పికప్ నుండి పునరావాసం వరకు నిరంతర వైద్యసేవలు – ఇంటివద్దకే హోమ్ కేర్ సేవలు – మెడిసిన్స్ హోమ్ డెలివరీ – ఫ్రీ అంబులెన్స్ పికప్ సర్వీస్ – ఫిజియోథెరపీ వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా కంటి వైద్యం మరియు దంత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. సాధారణ ఆరోగ్య భీమా కంటే ‘ఆయువు భరోసా’ ఎందుకు ఉత్తమమైనది? సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలో.. – అన్ని వ్యాధులకు కవరేజ్ ఉండదు – క్లయిమ్ చేయడానికి క్లిష్టమైన పద్ధతులు – దేనికైనా వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి – ఏజ్ లిమిట్ తో పాటు రిజెక్షన్స్ ఎక్కువ – ముందునుండి ఉన్న వ్యాధులకు కవరేజ్ ఉండదు ఆయువు భరోసాలో.. – 75 ఏళ్ళ వరకు అర్హులే – దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ముందునుండి ఉన్న వ్యాధులను కవర్ చేస్తుంది – ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు – రోగికి అవసరమైన హెల్త్ ప్యాకేజీలతో పాటు మరిన్ని విస్తృతమైన కవరేజ్ ల వెసులుబాటు – సులభతరమైన నగదు లావాదేవీలు ఆయువు భరోసాలో సభ్యత్వం ఎలా పొందాలి? ఆయువు భరోసాలో సభ్యత్వం పొందడం చాలా సులభం.. 9996247365 నెంబర్ కి ఒక్క కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. లేదా ayuvubharosa.com వెబ్ సైట్ ని సంప్రదించవచ్చు.
చలికాలం వేడి నీటితో స్నానం చేస్తే.. ఎన్ని నష్టాలో తెలుసా?

సాధారణంగా చలికాలం వచ్చిందంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుంటాయి. దీంతో చలి తీవ్రత పెరిగి చలికి వణికిపోతుంటారు. చలి తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు ఏ వయసు వారైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా చలికాలంలో స్నానం చేయాలంటే అందరూ వేడి నీటినే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. చలిలో శరీరానికి వేడి తగలగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాగే వేడి అనేది మానసికంగా ఉల్లాసం కలిగిస్తుంది. చలికాలంలో స్నానానికి వేడి నీళ్లు ప్రిఫర్ చేయడం వల్ల శరీరానికి సౌకర్యవంతంగా అనిపిస్తుందేమో గానీ.. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకవేళ ముందు నుండే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేడి నీళ్ళని ఉపయోగిస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం! వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం!
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ‘ఎయిడ్స్ డే‘ని సెలబ్రేట్ చేస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ‘ఎయిడ్స్ డే‘ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఎయిడ్స్ డే ఉద్దేశం.. HIV పై పోరాటాన్ని గుర్తు చేయడం, ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ బాధితులకు మద్దతుగా నిలవడం మరియు ఎయిడ్స్ కారణంగా మరణించిన వారికి నివాళులు అర్పించడం ‘ఎయిడ్స్ డే‘ యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు HIV శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ‘HIV'(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి.. శరీరం రోగాలతో పోరాడే శక్తిని క్షీణింపజేస్తుంది. HIV వైరస్ సోకే కారణాలు.. ఇండియాలో HIV/AIDS కేసులు (2023లో) ఇండియాలో మొత్తం యాక్టీవ్ కేసులు 25,00,000 ఉన్నట్లు UNAIDS గణాంకాలు చెబుతున్నాయి. 15 ఏళ్లు పైబడిన మహిళలు 11 లక్షల మంది 15 ఏళ్ళు పైబడిన పురుషులు 13 లక్షలకు పైగా.. 0-14 ఏళ్ళ పిల్లలు 61000 మంది ఉన్నారని యూఎన్ఏఐడిఎస్ తెలిపింది. ఇండియా/తెలుగు రాష్ట్రాలలో ఎయిడ్స్ గణాంకాలు?(2021 వరకు) నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజషన్(NACO) అంచనాల ప్రకారం.. 2021లో భారతదేశంలో మొత్తం 24,01,284 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 3,94,077 కేసులు ఉండగా.. అత్యల్పంగా అండమాన్ నికోబర్ 426, సిక్కిం 468 రాష్ట్రాలలో కేసులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 3,21,028, తెలంగాణలో 1,55,991 మంది బాధితులు ఉన్నట్లు తెలిపింది. NACO డాటా ప్రకారం, దేశవ్యాప్తంగా 2011-2021 మధ్య అన్‌ప్రొటెక్టెడ్ సె*క్స్(రక్షణ లేని) కారణంగా దాదాపు 17,08,777 మంది హెచ్ఐవీ బారినపడ్డారు. వీరిలో అత్యధికంగా ఏపీలో 3,18,814 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్ (2,84,577), కర్ణాటక (2,12,982), తమిళనాడు (1,16,536) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2021 వరకు ఇండియాలో ఎయిడ్స్ కారణంగా 41,968 మరణాలు నమోదు కాగా.. గడిచిన పదేళ్లలో(2011 – 2021) ఎయిడ్స్ మరణాలు 76.5% తగ్గినట్లు NACO తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు WHO గణాంకాలు చెబుతున్నాయి. ఎయిడ్స్ కారణంగా 6,50,000 మరణాలు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. HIV వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలు.. HIV ని నివారించడానికి కాలానుగుణంగా ఆధునిక పద్ధతులు కూడా ఎంతో అవసరం. ఇప్పటికీ సరైన పరిశోధన, పర్యవేక్షణ లేదు. 2000 నుండి 2010 వరకు ఎలాంటి పద్ధతులు పాటించారో.. ఇప్పటికీ అవే పద్ధతులు పాటిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు హెచ్ఐవి విషయంలో జనాలు ఎంతవరకు అప్డేట్ అయ్యారో! కాబట్టి.. హెచ్ఐవి నివారణ పద్ధతులు అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చికిత్స లేదు కాబట్టి కనీస జాగ్రత్తలు.. ఇప్పటిదాకా ‘హెచ్ఐవి కి చికిత్స లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గం‘ఇక యాంటీరెట్రోవైరల్ థెరపీ(ART) ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీనికి వైద్యుల సలహా మేరకు యాంటీరెట్రోవైరల్ మందులు(ARD) వాడటం మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.
శీతాకాలం ఆరోగ్య సంరక్షణకు 10 చిట్కాలు

చలికాలం వచ్చిందంటే చాలు.. ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నిటికీ రెక్కలు వచ్చేస్తాయి. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అమరేంద్ర బాహుబలి వచ్చాడు అన్నట్లుగా… చలికాలం వ్యాధులు కూడా మూకుమ్మడిగా శరీరంపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంటాయి. ముఖ్యంగా జలుబు, గొంతు పట్టేయడం, శ్వాసకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. మరి శీతాకాలం ఇలాంటి అనారోగ్య సమస్యలు మనల్ని దరిచేరకుండా ఉండాలంటే కొన్ని తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. అదే విధంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఉన్ని దుస్తులు ధరించడం, పొగ మంచు సమయంలో జాగ్రత్తగా ఉండటం అలవరచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చలి గాలులు వీచేటప్పుడు, పొగమంచు కురిసే వేళల్లో బయటికి వెళ్లకుండా ఉండాలి. చలి తీవ్రతని బట్టి ఉన్ని దుస్తులతో శరీరాన్ని, ముఖ్యంగా ముక్కు, చెవులను కవర్ చేసుకోవాలి. చలి ప్రభావం కూడా ఎక్కువగా ముఖం, పెదాలు, పాదాలపై ఉంటుంది. ఈ విధంగా చలికాలంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం! తరచూ చర్మం పొడిబారడం: చలికాలంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం. చర్మం జిడ్డు, తేమగా ఉండేవారికంటే పొడి చర్మం గల వారికే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. చర్మం పొడి బారడం మొదలైందంటే.. పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసం పొడి చర్మం గలవారు రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొంచం కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకొని స్నానం చేస్తే మంచిది. చర్మంపై సబ్బుల ప్రభావం: చలికాలంలో రెగ్యులర్ గా వాడే సబ్బుల కంటే గ్లిజరిన్ సబ్బులు వాడటం మంచిదని నిపుణులు సలహా. మాయిశ్చరైజర్లు: చలికాలంలో ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలంటే.. విటమిన్-E కలిగిన మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతులకు వేజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకొని, పాదాలకు సాక్సులు ధరించాలి. అలాగే వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. వ్యాయామం చేయాలి: చలికాలంలో నిద్ర లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్ర లేచాక కండరాలు పట్టేసినట్లు ఉంటుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ హుషారుగా ఉండాలంటే వ్యాయామం, యోగ, వాకింగ్ లాంటివి చేస్తే మంచిదని అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఒంట్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి: చలికాలంలో పదేపదే మూత్రం వస్తోందని నీరు తాగడం ఆపేస్తుంటారు. అలా చేయడం మీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. నీరు తక్కువ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి చర్మం పొడిబారడం మొదలవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి కాలం ఏదైనా నీరు తాగడం మాత్రం తగ్గించవద్దు. వెల్లులి చేసే మేలు: చలికాలంలో సాధారణంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమయాలలో వ్యాధుల బారిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకూడదు అంటే.. మీరు తినే ఆహారంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఎక్కువగా తీసుకోండి. అలాగే వెల్లుల్లి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. తీసుకునే ఆహారం: చలికాలంలో ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది. వేడి వేడి ఆహారం తీసుకుంటూ శీతల పానీయాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం. ముఖ్యంగా జంక్ ఫుడ్ ని బాగా ఇష్టపడుతుంటారు. అలాంటివారు జంక్ ఫుడ్ వల్ల మధుమేహం, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ కి పిల్లలను దూరంగా ఉంచాలి. పరిశుభ్రత తప్పనిసరి: చలికాలం ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన నిద్ర: ఏ కాలంలోనైనా మనిషికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. వయసును బట్టి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా సరైన నిద్ర శరీరంలో టాక్సిన్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి.. చలికాలంలో నిద్రకు కూడా ప్రాధాన్యత తప్పనిసరి అని విశ్లేషకులు చెబుతున్నారు. టీ – కాఫీలు తగ్గించాలి: వాతావరణం చల్లగా ఉందంటే.. చాలామంది ఎక్కువగా కాఫీ, టీలు తాగుతుంటారు. వాటి వల్ల శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగి డీ హైడ్రేషన్, నిద్ర లేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.