ఒత్తిడి నుండి బయటపడే మార్గాలు మరియు చికిత్సలు!

ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి కూడా ఓ భాగం అయిపోయింది. మానసికంగా ఒత్తిడికి గురైతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఒత్తిడికి లోనైతే మానసికంగా క్షీణించడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు భావోద్వేగ సంఘర్షణలు మెదడుకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. ఇలా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఒత్తిడి నుండి బయట పాడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని నివారణ మార్గాలు మరియు చికిత్సల గురించి తెలుసుకుందాం! ధ్యానం (Meditation): ధ్యానం చేయడం వల్ల మానసిక శాంతి త్వరగా లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉన్న ఉత్తమమైన మార్గాలలో ధ్యానం అత్యంత ప్రభావవంతమైది. ప్రతి రోజూ కొద్దిసేపు శాంతిగా కూర్చుని మనస్సును ప్రశాంత పరచడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల సూచన. వ్యాయామం (Exercise): వ్యాయామం ఒత్తిడిని తగ్గించడంలో అత్యంత సమర్థవంతంగా పని చేస్తుంది. శరీరంలో ఎండోర్ఫిన్ (హ్యాపీనెస్ హార్మోన్) విడుదల అవ్వడం వల్ల మనస్సుకు హాయి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామంలో భాగంగా జోగింగ్, యోగా లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటివి చేయడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడటం సులభం అవుతుంది. తక్షణమే రిలీఫ్ పొందే కిటుకులు (Instant Relief Techniques): సమయ పాలన (Time Management) సమయ పాలన అంటే టైమ్ మేనేజ్మెంట్. సరైన సమయపాలన కూడా ఒత్తిడి తగ్గించడంలో తోడ్పడుతుందని మీకు తెలుసా! మనం చేయవలసిన పనులలో ఖచ్చితంగా చేయాలి అనుకున్నవాటికి ప్రాధాన్యతనిచ్చి, మిగతా పనులను పక్కన పెడితే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. సమయానుసారం అన్ని ప్లాన్ చేసుకోవడం, ముఖ్యమైన తేదీలను క్యాలెండర్ లో మార్క్ చేయడం, మీటింగ్స్ లో అటెండ్ అవ్వడం లాంటివి సమయపాలనలో ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Diet) మంచి ఆహారం మన మనసుకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ మరియు ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయపడతాయి. మెంటల్ సపోర్ట్ (Mental Support) ఒత్తిడిని అధిగమించడంలో ఎవరికైనా మానసికంగా మద్దతు లభిస్తే త్వరగా దాని నుండి బయటపడతారు. మెంటల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. తరచూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడుతూ ఉండటం మనసుకి హాయిని అందిస్తుంది. ఆత్మ పరిశీలన (Self Reflection) ఆత్మ పరిశీలన అనేది మనల్ని మనం అనలైజ్ చేసుకొని, అసలు ఒత్తిడికి గురవడానికి గల కారణాలను కనుగొనడంలో సహాయపడే ప్రక్రియ. మన ఆలోచనలు, భయాలు మరియు ఇష్టాయిష్టాలు అర్థం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని అంగీకరించి, దాన్ని తగ్గించుకునే మార్గాన్ని గ్రహించవచ్చు. వైద్య చికిత్స (Medical Treatment) కొన్నిసార్లు తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురైన వారికి నిపుణుల సహాయం అవసరం అవుతుంది. ఈ స్థితిలో, సైకియాట్రిస్ట్ లేదా థెరపిస్ట్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. వారు పరిస్థితిని అంచనా వేసి.. తగిన సైకోథెరపీ, మందులు లేదా ఇతర చికిత్సలు సూచించవచ్చు. డైరీ మరియు నోట్స్ రాయడం (Journaling and Notes) నిత్యం జీవితంలో జరిగే అనుభవాలను, ఆలోచనలను నోట్స్ లో లేదా డైరీలో రాసుకోవడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇలా మీరు స్వతంత్ర ఆలోచనలను, మీ భావాలను బయట పెట్టడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మూవీ కామెడీ (Humor) నవ్వడం కూడా ఒత్తిడిని తగ్గించే మార్గాలలో ఒకటి. మీకు నచ్చిన జోక్స్, సినిమాలోని కామెడీ వీడియోలు లేదా మీ లైఫ్ లో నవ్వు తెప్పించిన సందర్భాలను గుర్తుచేసుకోవడం కూడా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని పూర్తిగా నివారించడం కష్టమే అయినప్పటికీ, ఒత్తిడిని తగ్గించే ఇటువంటి పద్ధతులు మరియు చికిత్సల ద్వారా దాని ప్రభావాన్ని మాత్రం క్రమంగా తగ్గించవచ్చు. వ్యాయామం, ధ్యానం, సమయపాలన, మరియు మెంటల్ సపోర్ట్ పొందడం వలన ఒత్తిడి నుండి ఎప్పటికప్పుడు బయటపడవచ్చు. ఇవేవి సాధ్యపడకపోతే, ఖచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఎదురైతే, కంగారు పడకుండా మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను 9851247365 నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిద్దాం! ఆనందంగా జీవిద్దాం!
వరల్డ్ లివర్ డే ప్రాముఖ్యత మరియు లివర్ సమస్యలు, నివారణ మార్గాలు!

మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలలో లివర్(కాలేయం) ఒకటి. శరీరంలో రెండవ పెద్ద అవయవంగా లివర్.. దాదాపు ఐదు వందల కంటే ఎక్కువ ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. లివర్ కి సంబంధించి ప్రతి ఏడాది ఏప్రిల్ 19న ‘ప్రపంచ కాలేయ దినోత్సవం'(వరల్డ్ లివర్ డే)ని జరుపుతుంటారు. ఆ రోజున లివర్ హెల్త్ గురించి అవగాహన కల్పించడానికి, లివర్ సంబంధించిన వ్యాధుల నివారణ మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వరల్డ్ లివర్ డేని ‘ఆహారమే ఔషధం'(ఫుడ్ ఈజ్ మెడిసిన్) అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఇది సమతుల ఆహారం లివర్ హెల్త్ కి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. కాగా, ఇప్పుడు ఈ బ్లాగ్ లో లివర్ యొక్క ప్రాముఖ్యత, సాధారణ లివర్ సమస్యలు మరియు లివర్ హెల్త్ ని కాపాడుకునే కీలకమైన అంశాల గురించి చర్చించుకుందాం. లివర్ యొక్క ముఖ్య విధులు: శరీరంలో లివర్ అనేది అత్యంత ముఖ్యమైన అవయవం. ఎందుకంటే ఇది 60-70% వరకు దెబ్బతిన్నప్పటికీ స్వీయనిర్మాణం చేసుకోగలదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం లివర్ సమస్యలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. సాధారణంగా ఎదుర్కొనే లివర్ సమస్యలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, 2017లో 1.5 బిలియన్ ప్రజలు దీర్ఘకాలిక లివర్ వ్యాధులను ఎదుర్కొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 2 మిలియన్ల మరణాలు లివర్ వ్యాధుల వల్ల జరుగుతున్నాయని తెలిపింది. ఆహారమే ఔషధం థీమ్: ఈ ఏడాది లివర్ హెల్త్ విషయంలో ఆహారం అనేది ఎంత బాగా పనిచేస్తుందో గుర్తుచేస్తుంది. సమతుల ఆహారం(పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లు) లివర్ వ్యాధులను నివారించడంలో, లివర్ పనితీరుని మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది. ప్రధానంగా మెడిటేరియన్ డైట్ (ఆలివ్ ఆయిల్, చేపలు మరియు తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) లివర్ కి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందువల్ల ఆహారపు అలవాట్లను నియంత్రించడం చాలా ముఖ్యం. అలాగే ఆహారం విషయంలో ఖచ్చితమైన మార్పులు చాలా అవసరం. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? లివర్ సంరక్షణ కోసం కొన్ని సాధారణ చిట్కాలు పాటించినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సమతుల ఆహారం మద్య సేవించడం తగ్గించాలి నియమిత ఆరోగ్య పరీక్షలు వ్యాయామం హెపటైటిస్ టీకాలు ధూమపానం మరియు డ్రగ్స్‌ను తీసుకోకూడదు అధిక బరువుని తగ్గించుకోండి వరల్డ్ లివర్ డే అనేది.. మనం లివర్ హెల్త్ కి ఎంత ప్రాధాన్యతని ఇవ్వాలో తెలియజేస్తుంది. సమతుల ఆహారం, వ్యాయామం మరియు ఆరోగ్య పరీక్షల ద్వారా లివర్ ని రక్షించుకోవచ్చు. లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు పాటించండి మరియు ఇతరులకు అవగాహన కల్పించడంలో సహకరించండి.
శరీరంలో అధిక వేడిని తగ్గించే చక్కని మార్గాలు!

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే.. అధిక వేడికి అన్ని వయసుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజురోజుకూ ఎండలు తీవ్రం అవుతుంటాయి. దానివల్ల వాతావరణంలో వేడి అధికంగా పెరిగిపోయి.. అది మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, చర్మ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మరి ఈ మండు వేసవిలో మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ లో ఉంచుకోవడానికి కొన్ని సహజ సిద్ధమైన మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం! వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. శరీర ఉష్ణోగ్రతను తగ్గించే కొన్ని మార్గాలు హైడ్రేషన్ చల్లదనాన్ని అందించే ఆహారాలు వేడి పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి సహజంగా చల్లదనం అందించే పదార్థాలు చర్మ సమస్యల నుండి రక్షణ ఆరోగ్యకరమైన జీవనశైలి వ్యాయామం మరియు విశ్రాంతి తీవ్రమైన లక్షణాలకు తగిన వైద్య సహాయం ఇలా ఎటువంటి సమస్య ఎదురైనా.. మా ‘మెడ్ యునైటెడ్’ వైద్య నిపుణులు మీకు సహాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేయండి.వైద్యుల సలహాలను పాటించి, ఆరోగ్యకరమైన వేసవిని ఆస్వాదించండి.
శరీరంలో వేడిని తగ్గించేందుకు తప్పక తాగాల్సిన పానీయాలు!

ఎండల కాలంలో శరీరంలో వేడి పెరిగిపోయి డీహైడ్రేషన్, వడదెబ్బ లాంటి సమస్యలు ఆరోగ్యాన్ని కుదిపేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులలో శరీరానికి చల్లదనాన్ని అందించే ఆహారం, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిని తట్టుకోలేక చాలామంది థంబ్స్ అప్, స్ప్రైట్ లాంటి శీతల పానీయాలు తాగేస్తుంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయేమో గానీ, ఆరోగ్యానికి మేలు చేయవు. అయితే.. అధిక వేడిలో ఆరోగ్యానికి సహజంగా లభించే పానీయాలు ఎంతో మేలు చేస్తాయి. మరి ఈ మండు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే నేచురల్ డ్రింక్స్ ఏమున్నాయో చూద్దాం! నిమ్మరసం (లెమన్ వాటర్) అత్యంత సులభంగా తయారు చేసుకోగలిగే పానీయాలలో ఇది ఒకటి. ఒక గ్లాసు చల్లని నీటిలో నిమ్మకాయ పిండి, కొద్దిగా తేనె లేదా ఉప్పు కలిపి తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మరసం శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కొబ్బరి నీళ్లు కొబ్బరి నీరు ప్రకృతి మనకు ప్రసాదించిన ఉత్తమ హైడ్రేషన్ డ్రింక్. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల వేసవిలో చెమటతో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. రోజూ ఒక తాజా కొబ్బరి నీరు తాగడం వల్ల ఒంట్లో వేడి తొలగిపోయి చల్లగా ఉంటుంది. మజ్జిగ (బటర్ మిల్క్) వేసవిలో మజ్జిగ తాగడం అనేది అత్యుత్తమ ఎంపిక. ఇంట్లోనే సులభంగా పెరుగును నీటితో కలిపి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి తయారు చేసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను పెంపొందించడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పుచ్చకాయ జ్యూస్(వాటర్ మిలన్) పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది వేసవిలో డీహైడ్రేషన్ ని నివారిస్తుంది. పుచ్చకాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. రుచి కోసం కొద్దిగా పుదీనా ఆకులు జోడించినా మంచిదే. ఒకవేళ జ్యూస్ లాగా కాకపోయినా ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సబ్జా నీరు (బాసిల్ సీడ్స్ డ్రింక్) సబ్జా గింజలను నీటిలో నానబెట్టి, వాటిని నిమ్మరసం లేదా రోజ్ సిరప్‌తో కలిపి తాగితే శరీరానికి త్వరగా చల్లదనం లభిస్తుంది. వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. ఎన్ని పానీయాలు తీసుకున్నా వేసవిలో నీరు ఎక్కువ తాగడం మాత్రం మర్చిపోవద్దు. రోజుకు కనీసం 2-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పానీయాలలో నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్, సబ్జా నీరు అయితే ఇంట్లోనే తేలికగా చేసుకోవచ్చు. మరి ఈ మండు వేసవిలో అధిక వేడిని సహజ సిద్ధమైన పానీయాలతో తరిమికొట్టండి! సంతోషంగా వేసవిని ఆస్వాదించండి! మరి ఈ వేసవిలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మా సైట్ లో ఇటీవల పోస్ట్ చేసిన చాలా బ్లాగ్స్ ఉన్నాయి.. గమనించగలరు. ఇక ఈ వేసవిలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.
వేసవి ఎండల్లో పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వేసవి కాలం వచ్చిందంటే మండుటెండలు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. సాధారణంగా వేసవి ఎండలను పెద్దలు తట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆటలు ఆడుకుంటూ, అల్లరి చేసే పిల్లలు నీడలో తప్ప ఎండలో అసలు తట్టుకోలేరు. ఫలితంగా డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తప్పక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఎండాకాలం పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా అనేది చూద్దాం! డీహైడ్రేషన్ నివారించడం: వేసవిలో పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు. దీంతో చెమట పట్టడం వల్ల వారి శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది. అయితే, డీహైడ్రేషన్ ని నివారించాలంటే.. వేడి నుండి రక్షణ: మధ్యాహ్న సమయంలో ఎండ వేడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో బయటికి వెళ్తే.. పిల్లల చర్మం, కళ్లు త్వరగా దెబ్బతింటాయి. కాబట్టి.. దుస్తుల ఎంపిక: వేసవిలో తక్కువ వేడిని కలిగించే దుస్తులు పిల్లలకు సౌకర్యాన్ని ఇస్తాయి. కాబట్టి దుస్తుల విషయంలో ఎంపిక తప్పనిసరి. ఎలాంటి ఆహారం అందించాలి: వేసవిలో పిల్లల శరీరానికి పోషకాలతో కూడిన శరీరంలో వేడిని తగ్గించే (చలువ చేసే) ఆహారాన్ని అందించాలి. ఇంటి వాతావరణాన్ని చల్లగా ఉంచాలి: పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతారు కాబట్టి.. ఇంటి వాతావరణం సౌకర్యవంతంగా ఉంచాలి. ఆరోగ్య సమస్యలను గుర్తించాలి: మండుటెండల్లో పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోండి. ఆటలు, పనులలో జాగ్రత్తగా చూసుకోవాలి: పిల్లలు ఆడుకోవడం సహజం, కానీ వేసవిలో దీన్ని కాస్త నియంత్రించాలి. లేదంటే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో మండుటెండల నుండి పిల్లలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ కి గురవ్వకుండా.. తేలికపాటి దుస్తులు వేసి.. ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడిపేలా చూడాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట ఆటలకు ప్రోత్సహించాలి. కాకపోతే, పిల్లలు ఏ పని చేస్తున్నా.. ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి ఆరోగ్య రక్షణ చూసుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, డాక్టర్ సలహాలు తీసుకుంటే పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా వేసవిని సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ వేసవిలో మీ ఆరోగ్యానికి, పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఏర్పడినా.. 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణుల సలహాలు పొందవచ్చు!
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. కొత్త లక్ష్యంతో జీవితాన్ని ఆరంభిద్దాం!

ఒకప్పుడు జీవితం అంటే ఎన్నో అంశాలను ప్రస్తావించి చెబుతుండేవారు. జీవితమంటే.. బంధాలు బాంధవ్యాలు, మనుషులు, స్నేహం, డబ్బు, సంతోషం, ఉద్యోగం.. ఇలా ఎన్నో చెప్పేవారు. కానీ, కొన్నాళ్ళుగా ఆరోగ్యానికి సంబంధించి నిర్వచనాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానాల మధ్య, వేగంగా సాగిపోతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే లభిస్తుందేమో గానీ, ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వస్తే మాత్రం ఎవరూ ఏమి చేయలేరు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం మాత్రమే. వస్తువు పాడైతే.. బాగు చేయించుకునే అవకాశం ఉంటుంది లేదా కొత్త వస్తువు కొనుక్కునే అవకాశం ఉంది. కానీ.. ఒకసారి ఆరోగ్యం పాడైందంటే మాత్రం ఎన్ని చేసినా, ఎంత ఖర్చు పెట్టినా పోయిన ఆరోగ్య పరిస్థితి మాత్రం తిరిగి పొందలేము. అందుకే ఆరోగ్యమే భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. ఆరోగ్యం లేకపోతే జీవితంలో ఎంత సంపద ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఆనందం ఉండదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతుంటారు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO) స్థాపించిన రోజు. కావున ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుతారు. ఆరోగ్యం అంటే.. కేవలం శారీరకంగా మాత్రమే కాదు.. మానసిక శాంతి, సామాజిక సంబంధాలు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం మరియు ఆరోగ్య సమస్యలపై చర్చించడం. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా WHO ఒక థీమ్ ‘ఆనందకరమైన భవిష్యత్ కోసం ఆరోగ్యకరమైన ప్రణాళిక వేయడం’ ప్రకటించింది. ఈరోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? మన రోజువారీ జీవితంలో కొన్ని సులభమైన అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. వాటిలో ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం! సమతుల్య ఆహారం శారీరక శ్రమ మానసిక ఆరోగ్యం నిద్ర మెడికల్ చెకప్స్ 2025లో కొత్త ఆరోగ్య సవాళ్లు: మారుతున్న ప్రపంచంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా మారుతూ వస్తున్నాయి. 2025 నుండి రానున్న కాలంలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఇలా ఉండవచ్చు: ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, ఆరోగ్యం గురించి సరైన రీతిలో అవగాహన కల్పించేందుకు ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఒక గొప్ప అవకాశం. ఆరోగ్యకరమైన జీవనశైలి.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సామాజిక బాధ్యత: ఆరోగ్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, సామాజికమైనది కూడా అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ ఒక్కరి ఆరోగ్యం మాత్రమే కాపాడుకుంటే సరిపోదు కదా.. ఈ 2025లో మనం ఇలా చేయవచ్చు. 2025 లక్ష్యం: ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే బాగుంటుంది. ఉదాహరణకు.. ఈ చిన్న పనులు మన జీవితంలో, సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. ఆరోగ్యమే జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మరింత మెరుగ్గా జరుపుకోవడానికి కృషి చేద్దాం. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి, చుట్టూ ఉన్నవాళ్లకు స్ఫూర్తిగా నిలుద్దాం! *మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఏర్పడినా.. వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేయండి. మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులు మీకు తగిన సూచనలు, సలహాలు అందించగలరు.
వడదెబ్బ, డీహైడ్రేషన్ లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ మార్గాలు!

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండల కారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి రోజువారీ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలామంది వడదెబ్బ(హీట్ స్ట్రోక్) మరియు డీహైడ్రేషన్ కి గురవుతుంటారు. వీటి ప్రభావానికి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మరి ఎంతటి వేడి వాతావరణంలోనైనా వడదెబ్బ, డీహైడ్రేషన్ లాంటి ఆరోగ్యానికి ముప్పు కలిగించే ప్రభావాల నుండి ఎలా బయటపడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఒకవేళ వడదెబ్బకు గురైతే చికిత్స మార్గాలు ఏమేం ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం! వడదెబ్బ (Heatstroke) అంటే ఏంటి? వడదెబ్బ అనేది శరీరంలో అధిక వేడిని తట్టుకునే శక్తిని కోల్పోవడం వల్ల కలుగుతుంది. వడదెబ్బకు సాధారణంగా వాతావరణంలో ఏర్పడే తీవ్ర ఉష్ణోగ్రతలు, నీరు సరిగ్గా తీసుకోకపోవడం లేదా శరీరంపై అధికంగా ఒత్తిడి పడిన సందర్భాలు కారణంగా నిలుస్తాయి. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. డీహైడ్రేషన్ (Dehydration) డీహైడ్రేషన్.. ఇది శరీరానికి సరైన మోతాదులో నీరు, సాల్ట్ అందించకపోవడం వల్ల కలుగుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా చెమట పట్టడం లేదా నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే.. నివారణ మార్గాలు: వడదెబ్బ, డీహైడ్రేషన్ ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చిన్నపాటి నివారణ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వడదెబ్బ, డీహైడ్రేషన్ లకు చికిత్స మార్గాలు: వేసవిలో వడదెబ్బ మరియు డీహైడ్రేషన్ నుండి రక్షణ కోసం.. ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువగా బయట తిరగకుండా ఉండటం మరియు సరైన మోతాదులో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. *ఒకవేళ మీకు వడదెబ్బ, డీహైడ్రేషన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, ఎండల కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురైనా వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా వైద్య నిపుణుల సలహాలను పొందవచ్చు.
ఆటిజం అంటే ఏమిటి?

ఆటిజం అనేది మెదడు అభివృద్ధిలో వచ్చే తేడాల వల్ల కలిగే స్థితి. ఇది సాధారణంగా బాల్యంలోనే కనిపిస్తుంది. దీనిని మందబుద్ధి అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత మొదటి మూడేళ్ళలో దీని లక్షణాలు తెలుస్తాయి. ఆటిజం ఉన్నవాళ్ళు.. సామాజిక విషయాలను అర్థం చేసుకోవడంలో, ఇతరులతో మాట్లాడటంలో మరియు వారి ప్రవర్తనలోను కాస్త విభిన్నంగా ఉండవచ్చు. ఈ ఆటిజం అనేది వ్యాధి కాదు, ఒక వ్యక్తిలో కనిపించే వైవిధ్యం మాత్రమే. ఆటిజం ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానంలోనైనా.. జీవితాన్ని ఆస్వాదించడంలో, అనుభూతి చెందడంలోనైనా వైవిధ్యం కనిపిస్తుంది. ఇక ప్రతి ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఆటిజం ఆవగాహన దినోత్సవం’ని జరుపుతుంటారు. ఆ రోజున ఆటిజంతో బాధపడే వారికి మద్దతు కల్పిస్తూ, సమాజంలో వారికి సరైన గౌరవ మర్యాదలు, ఉపాధి అవకాశాలు అందించాలని, వారి పట్ల బాధ్యతగా మెలగాలని గుర్తు చేస్తూ.. ఆటిజం డే నిర్వహిస్తారు. మరి ఆటిజం అంటే ఏంటి? దాని పూర్తి వివరాలు ఏంటనే వివరాల్లోకి వెళ్దాం.. ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి? ఆటిజం లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి. కానీ, మనం సాధారణంగా చూసినట్లయితే.. చూడటం, పలకరించడంలో ఇబ్బంది పడటం కమ్యూనికేషన్ సమస్యలు ప్రవర్తనలో మార్పులు మరియు పరిమిత ఆసక్తులు సెన్సరీ సమస్యలు ఆటిజం రావడానికి గల కారణాలు: ఆటిజం రావడానికి ఖచ్చితమైన కారణాలేవి తెలియలేదు. కానీ.. జన్యుపరంగా మరియు పర్యావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆటిజం రోగనిర్ధారణ: ఆటిజం అనేది.. సాధారణంగా బాల్యంలోనే (2-3 సంవత్సరాల వయస్సులో) గుర్తించబడుతుంది. వ్యక్తి యొక్క ప్రవర్తన, ఎదుగుదల, మరియు వైద్య పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు. *బాల్యంలోనే ఆటిజం యొక్క లక్షణాలను గమనించి, రోగ నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వయసులో వారికి తగిన సహాయం అందిస్తే పిల్లల యొక్క జీవన నాణ్యత మెరుగవుతుంది. ఆటిజం చికిత్స మరియు నివారణ మార్గాలు: ఆటిజం అనేది.. సాధారణంగా నయం చేయబడే వ్యాధి కాదు. కానీ సరైన సమయంలో చికిత్స మరియు తగిన సహకారం అందిస్తే ఆ లక్షణాలను నివారించవచ్చు. ఆటిజం నివారణకు సంబంధించి కొన్ని చికిత్స పద్ధతులు: సమాజంలో ఆటిజంపై అవగాహన: ఆటిజం ఉన్న వ్యక్తులు తరచూ సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారిని అర్థం చేసుకోవడం, గౌరవించడం మన బాధ్యత. విద్యా సంస్థలు, ఉద్యోగ సంస్థలు వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎప్పటికప్పుడు ఆటిజం గురించి అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు మనం చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఆటిజం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఆటిజం అనేది ఒక వైవిధ్యత. రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లను తెచ్చినప్పటికీ, ఆటిజం ఉన్న వ్యక్తులు కూడా అద్భుతమైన నైపుణ్యాలు, ఆసక్తులతో ఎన్నో సాధించగలుగుతారు. ఆటిజం ఉన్నవారికి సరైన సహాయం, ప్రేమ ఆప్యాయతలు, సమాన గౌరవం లభిస్తే వారు కూడా సంతోషకరమైన జీవనాన్ని సాగించగలరు. నేటి నుండే ఆటిజం గురించి అవగాహన కల్పిద్దాం! మెరుగైన సమాజ అభివృద్ధిలో భాగమవుదాం! *మీ జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలిగినా వెంటనే 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించవచ్చు.
వేసవిలో ఉద్యోగాలకు వెళ్తున్నారా..? మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి!

వేసవి కాలం అంటేనే ఎండలు, ఉక్కపోత, డీహైడ్రేషన్ లాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోసం బయటకు వెళ్లేవారికి ఈ ఎండల కాలంలో కొంచం కష్టంగా ఉంటుంది. ఆఫీసులకు వెళ్లడం, రోడ్లపై ప్రయాణించడం లేదా ఫీల్డ్ వర్క్ లాంటివి వేడి వాతావరణంలో చేయడం ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే, కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి హాని లేకుండా సౌకర్యవంతంగా ఉండవచ్చు. మరి ఈ మండు వేసవిలో ఉద్యోగాలకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం! డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటం వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ వేసవిలో డీహైడ్రేషన్ కి గురవ్వకుండా ఉండాలంటే.. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం వేసవిలో వేడిని తట్టుకొని, మనకు సౌకర్యవంతంగా అనిపించే దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల (UV rays) నుండి రక్షణ వేసవి కాలంలో అతినీలలోహిత కిరణాలు (UV rays) చర్మము మరియు కళ్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. వాటి నుండి రక్షణ పొందాలంటే.. ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేసవిలో మనం తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మండుటెండల్లో ఆహారం అధికంగా తీసుకోకుండా ఎక్కువగా పండ్లు, తేలికైన ఆహారం తీసుకుంటే మంచిది. ప్రయాణంలో జాగ్రత్తలు ఉద్యోగం కోసం బయటకు వెళ్లేటప్పుడు ప్రయాణం కూడా సవాలుగా మారవచ్చు. ఆరోగ్య సమస్యలను గుర్తించడం వేసవిలో ఉద్యోగాలకు వెళ్లేవారికి ప్రయాణంలో వడదెబ్బ(హీట్ స్ట్రోక్), హీట్ ఎగ్జాస్ట్ సమస్యలు రావచ్చు. వాటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.. వేసవి కాలంలో ఉద్యోగాలకు వెళ్లడం తప్పనిసరి అయినట్లయితే.. పైన చర్చించుకున్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యానికి రక్షణ కల్పించుకున్నవారు అవుతారు. అలాగే ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, తేలికైన దుస్తులు ధరించడం, సూర్య కిరణాల నుండి రక్షణ కల్పించుకొని, తేలికైన ఆహారం అలవాటు చేసుకుంటే.. మండుటెండల్లో కూడా మీ రోజువారీ జీవితం సులభంగా సాగుతుంది. ఈ వేసవి ఎండల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. ఆనందంగా ఉండండి! *మీకు ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య ఏర్పడినా.. 9851247365 నెంబర్ కి కాల్ చేసి మా మెడ్ యునైటెడ్ వైద్య నిపుణులను సంప్రదించండి..
ఉగాది షడ్రుచులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి?

తెలుగు సంస్కృతిలో ఉగాది పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. దానికి పూర్వకాలం నుండే ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. ఉగాది అనేది.. సరికొత్త తెలుగు సంవత్సరాదికి ఆరంభం మాత్రమే కాదు, మానవ జీవన విధానంలో సమతుల్యత(బ్యాలెన్సింగ్)ని గుర్తుచేసే ఒక ప్రత్యేకమైన రోజు. ఉగాది పండుగ అనగానే.. ముందుగా అందరికి ఉగాది పచ్చడి గుర్తుకు వస్తుంది. ఆరు రకాల రుచుల కలయికతో(షడ్రుచులు) జీవితంలోని వివిధ కోణాలను, అనుభవాలను సూచిస్తుంది ఉగాది పచ్చడి. అయితే.. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి కమ్మని రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది? దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం! ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఏవి? ఉగాది పచ్చడిని – వేపపువ్వు (చేదు), బెల్లం (తీపి), చింతపండు (పులుపు), ఉప్పు (ఉప్పు), మిరప (కారం), మామిడి కాయ (వగరు) అని ఈ ఆరు రుచులతో తయారు చేస్తారు. మరి ఈ షడ్రుచులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి? తీపి (బెల్లం): తీపి అనేది శరీరానికి శక్తిని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఉండే ఇనుము, కాల్షియం రక్తహీనతను నివారిస్తాయి. అలాగే శరీరంలో వేడిని తగ్గించి, కఫ దోషాన్ని బ్యాలన్స్ చేస్తుంది. తీపిని మితంగా తీసుకుంటే మేలు చేస్తుంది.. అధికంగా తీసుకుంటే మధుమేహం ప్రమాదం పెరగవచ్చు. పులుపు (చింతపండు): ఆకలిని పెంచడమే కాకుండా శరీరంలో జీర్ణ రసాలను ఉత్తేజపరుస్తుంది. చింతపండులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. కానీ, ఎక్కువ పులుపు తీసుకుంటే గుండెల్లో మంటను కలిగించవచ్చు. ఉప్పు (ఉప్పు): ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడమే గాక, నీటి శాతాన్ని బ్యాలన్స్ చేస్తుంది. ఇది పిత్త దోషాన్ని నివారిస్తుంది. కానీ, అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది కాబట్టి తక్కువగా మితంగా తీసుకుంటే మంచిది. కారం (మిరప): కారం అనేది జీవక్రియను (మెటబాలిజం) వేగవంతం చేయడమే గాక చెమట ద్వారా వేడిని తగ్గిస్తుంది. మిరప కాయల్లోని క్యాప్సైసిన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కానీ, తీసుకునే ఆహారంలో ఎక్కువ కారం అల్సర్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను తెస్తుందని గుర్తుంచుకోవాలి. చేదు (వేపపువ్వు): వేప చేదు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది ఎలాగంటే.. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. ఇది పిత్త దోషాన్ని నివారించడమే గాక, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ చేదుని పిల్లలకు దూరంగా ఉంచాలి. వగరు (మామిడి): మామిడి వగరు జీర్ణక్రియను సులభతరం చేయడమే గాక శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మామిడికాయలో విటమిన్ A, C ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. అయితే.. ఎక్కువ వగరు తింటే గొంతు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఆరు రుచులు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) నియంత్రిస్తాయి. అయితే.. ఈ 6 రుచులలోని ఒక్కో రుచి శరీరంలో ఏయే అవయవాలను ఉత్తేజపరుస్తాయో ఇప్పుడు చూద్దాం! తీపి – కడుపు, ప్లీహము పులుపు – గుండె, ఊపిరితిత్తులు ఉప్పు – కిడ్నీలు కారం – పెద్దప్రేగు చేదు – కాలేయం వగరు – చిన్నప్రేగు ఈ రుచులను తగిన మోతాదులో తీసుకోవడం శరీర ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ ఉగాది షడ్రుచులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఒక సంపూర్ణ ఔషధంగా పనిచేస్తాయి. ఈ విశ్వావసు నామ ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులను ఆస్వాదిస్తూ, వాటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ప్రారంభించడానికి ఉగాది పచ్చడి ఒక అద్భుతమైన మార్గం. ఈ ఉగాది మీకు చక్కని ఆరోగ్యాన్ని అందించాలని కోరుతూ.. మరోసారి మెడ్ యునైటెడ్ వారి తరపున శుభాకాంక్షలు!